నందమూరి బాలకృష్ణ తన కుమార్తెలను సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతారు. బ్రాహ్మణి, తేజస్విని ఇలా బాలయ్య కుమార్తెలిద్దరూ ఎవరికి వారే ప్రత్యేకతను చాటుతారు. రీసెంట్ గానే బాలయ్య చిన్న కుమర్తె తేజస్విని బాలయ్య కు కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది. ఆ విషయంలో ఆమె 100 శాతం సక్సెస్ అయ్యింది. బాలయ్య స్టైలింగ్ కి బాలయ్య అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు.
అతేజస్విని నిర్మాతగానూ మారింది. బాలయ్య సినిమాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది. తమ్ముడు మోక్షజ్ఞ సినిమాకి వన్ ఆఫ్ ద నిర్మాత గా ఉంది. ఇప్పుడు తేజస్విని డైరెక్ట్ గా కెమెరా ముందు కనిపించేందుకు సిద్దమవుతుంది అనే వార్త నందమూరి అభిమానులను ఎగ్జైట్ చేస్తుంది.
నందమూరి ఫ్యామిలిలో ఏ అమ్మాయి చెయ్యనిది తేజస్విని చెయ్యబోతుంది. తేజస్విని హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక జ్యూవెలరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తుంది. అందుకోసం తేజస్విని ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసమే ఆమె మేకప్ వేసుకుంది.
ఆ జ్యువెలరీ ఈ షూట్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. మొట్ట మొదటిసారి తేజస్విని ఇలా కెమెరా ముందుకు వచ్చి నటించబోతుంది. అదే అభిమానులను సర్ ప్రైజ్ చేసే విషయం.