Advertisementt

మటన్ సూప్ విజయం సాధించాలి -డైరెక్టర్ వశిష్ట

Wed 08th Oct 2025 02:08 PM
mutton soup movie  మటన్ సూప్ విజయం సాధించాలి -డైరెక్టర్ వశిష్ట
Mutton Soup Movie Pre-Release Event మటన్ సూప్ విజయం సాధించాలి -డైరెక్టర్ వశిష్ట
Advertisement
Ads by CJ

డిఫరెంట్ కథా, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లోకి రాబోతోంది. ఈక్రమంలో మంగళవారం (అక్టోబర్ 7) నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. అనంతరం నిర్వహించిన ఈవెంట్‌లో..

సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. మటన్ సూప్ టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ ఎంత బాగుందో.. సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. మా కోసం వచ్చిన విశిష్ట అతిథి వశిష్ట గారికి థాంక్స్. మటన్ సూప్ ను ఎంతో ఇష్టపడి తీశాం. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.

హీరో రమణ్ మాట్లాడుతూ.. మటన్ సూప్ ఈవెంట్‌ కోసం వచ్చిన వశిష్ట గారికి థాంక్స్. మటన్ సూప్ ని రామచంద్ర అద్భుతంగా తీశారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 10న మా సినిమాను చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది అని అన్నారు.

నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ.. మటన్ సూప్ సినిమాకు టీం ఎంతో సహకరించింది. జెమినీ సురేష్ గారు మాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. ఇందులో జెమినీ సురేష్ గారి నటన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వెంకీ వీణా ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. మటన్ సూప్ టైటిల్ వద్దని మొదట్లో చెప్పాను. కానీ కథ విన్న తరువాత ఆ టైటిల్ అయితేనే పర్పెక్ట్ అని తెలిసింది. సెన్సార్ నుంచి కూడా మాకు సమస్యలు వచ్చాయి. అన్ని అడ్డంకులు దాటుకుని అక్టోబర్ 10న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రామచంద్ర ఈ సినిమాను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. మా అమ్మ గారి కలను ఆడియెన్స్ ముందుకు అక్టోబర్ 10న తీసుకు వస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా కోసం ఈవెంట్‌కి వచ్చిన వశిష్ట గారికి థాంక్స్ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. మటన్ సూప్ సినిమాను నేను చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అని అన్నారు.

నిర్మాత రామకృష్ణ సనపల మాట్లాడుతూ.. మా మటన్ సూప్ కోసం వచ్చిన వశిష్ట గారికి థాంక్స్. మటన్ సూప్ టైటిల్ చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. కానీ ఈ మూవీకి, ఈ కథకు ఆ టైటిల్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. మన చుట్టూ జరిగే కథల్నే ఈ సినిమాలో రామచంద్ర అద్భుతంగా చూపించారు. రమణ్ గారు, జెమినీ సురేష్ గారు, వర్ష విశ్వనాథ్ ఇలా అందరూ చక్కగా నటించారు. ఈ మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నాను అని అన్నారు.

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ.. మటన్ సూప్ టైటిల్ విచిత్రంగా, బాగుందని అనిల్ రావిపూడి గారు మెచ్చుకున్నారు. ఈ మూవీ కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఈ మూవీకి ఈ టైటిల్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ చిత్రంలో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 10న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తే మరి కొంత మంది ఇండస్ట్రీలోకి వస్తారు. మా కోసం వచ్చిన వశిష్ట గారికి థాంక్స్ అని అన్నారు.

నటుడు శ్రీ చరణ్ మాట్లాడుతూ.. మటన్ సూప్ లో నాకు మంచి పాత్రను ఇచ్చారు. ఇంత వరకు నేను 15 సినిమాలు చేశాను. కానీ దర్శకుడు రామచంద్ర లాంటి క్లారిటీ ఉన్న దర్శకుడిని చూడలేదు. హీరో రమణ్ గారు చక్కగా నటించారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అక్టోబర్ 10న రానున్న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణా మాట్లాడుతూ.. మటన్ సూప్ ని టీం అంతా కలిసి ఎంతో ప్రేమగా రూపొందించాం. నిర్మాతల సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. రామచంద్ర గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.

నటుడు కిరణ్ మేడసాని మాట్లాడుతూ .. మటన్ సూప్ లో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి అని అన్నారు.

నటుడు గోవింద్ మాట్లాడుతూ.. మటన్ సూప్ లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్.  ఈ మూవీని ఎంతో ఇష్టపడి చేశాం. కానీ చాలా కష్టపడి ఇక్కడి వరకు సినిమాను తీసుకు వచ్చారు. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.

Mutton Soup Movie Pre-Release Event:

I wish the Mutton Soup movie a big success -director Vashishtha at the pre-release event

Tags:   MUTTON SOUP MOVIE
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ