Advertisementt

ఇంత సైలెంట్ ఎందుకు నాగ్

Tue 07th Oct 2025 11:14 AM
nagarjuna  ఇంత సైలెంట్ ఎందుకు నాగ్
King milestone film gets going ఇంత సైలెంట్ ఎందుకు నాగ్
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున తన 100 వ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతారా అని అభిమానులు ఏడాదిన్నర కాలంగా  చూస్తున్నారు. నా సామి రంగ తర్వాత నాగార్జున సోలో గా సినిమా మొదలు పెట్టలేదు. అందులోను కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే ప్రాజెక్ట్ కావడంతో అందరి చూపు #Nag100 పైనే ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ తో నాగార్జున తన 100వ సినిమా చేస్తున్నానని చెప్పారు. 

అంతేకాదు కథ పై తను కార్తీక్ తో ఆరు నెలలుగా ట్రావెల్ చేస్తున్నా అన్నారు. అయితే నాగార్జున తన 100 వ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేస్తారు, మెగాస్టార్ చిరు గెస్ట్ గా ఈపూజ కార్యక్రమాలు జరుగుతాయనే ప్రచారం జరిగింది. కానీ నాగార్జున నిన్న సోమవారం చాలా సింపుల్ గా సైలెంట్ గా #King100 ప్రాజెక్ట్ ని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టేసారు. 

నాగార్జున పూజా కార్యక్రమాలతో తన 100 వ చిత్రాన్ని మొదలు పెట్టి ఆ విషయాన్ని తెలియజేస్తూ రెండు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అక్కినేని అభిమానులు ఎగ్జైట్ అయినా.. ఎందుకింత సైలెంట్ గా పూజ కార్యక్రమాలు చేశారు, గ్రాండ్ గా మొదలు పెడితే బావుండేదిగా అంటూ నాగ్ ని అడుగుతున్నారు. 

నిజమే కదా.. కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా మొదలు పెట్టి ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచడం చాలా అవసరమనేది అభిమానుల అభిప్రాయం. 

King milestone film gets going:

Nagarjuna milestone film makes headway

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ