మలయాళంలో టాప్ స్టార్ దుల్కర్ సల్మాన్ తెరకెక్కించిన కొత్త లోక చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన కొత్త లోక 1 కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా భాషల్లోనూ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసింది. మలయాళంలో రూ. 300 కోట్లు గ్రాసర్ కొల్లగొట్టిన చిత్రంగా కొత్తలోక నిలిచింది.
ఇప్పటికి కొత్త లోక థియేటర్స్ లో హౌస్ ఫుల్ కనిపిస్తుంది అంటే ఈ చిత్రం మౌత్ టాక్ తో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అనేది అర్ధమవుతుంది. రూ.300 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయిన కొత్త లోక చిత్ర ఓటీటీ రిలీజ్ పై అందరిలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నడుస్తుంది.
ఇప్పుడు కొత్త లోక ఓటీటీ డేట్ పై క్రేజీ న్యూస్ ఒకటి వినబడుతుంది. మలయాళ సూపర్ హిట్ ఫిలిం కొత్త లోక ఈ దివాళి సందర్భంగా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. లోక చాప్టర్ 1 డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న జియో హాట్ స్టార్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ లోకి తెచ్చే ఆలోచనలో ఉంది అంటున్నారు.
సో రూ.300 కోట్ల మూవీ ఈ దీపావళి సందర్భంగా ఓటీటీలోకి వచ్చేస్తుందనే విషయం తెలిసి ఓటీటీ ఆడియన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు.