కల్కి 2898 AD చిత్రంలో దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ లేడీ గా దీనురాలిగా కనిపిస్తుంది. ప్రభాస్ ఆమెకు సహాయం చెయ్యడానికి ట్రై చేసాడు, అమితాబ్ దీపికా రక్షకుడిగా కనిపించారు. కల్కి చిత్రంలో దీపికా కీలకంగా కనిపిస్తుంది. ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి మేకర్స్ డెడికేషన్ లేదు అంటూ ఆమెను తప్పించారు. కల్కి 2 లో కూడా దీపికా పదుకొనే పాత్రకు చాలా ఇంపార్టన్స్ ఉంది.
ఇప్పుడు కల్కి 2 లో దీపికా ను తప్పించారు, ఆమె ప్లేస్ లోకి ఎవరొస్తారు, అంత పెద్ద బాధ్యతను ఏ హీరోయిన్ మోస్తుంది అనే ఉత్సుకత చాలామందిలో ఉంది, దీపికా పదుకొనె ప్లేస్ లో చాలామంది హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి.. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదిస్తున్నారనే వార్త వైరల్ అయ్యింది.
కల్కి లో హీరోయిన్ కి ఎలాంటి ఎక్స్పోజింగ్ అక్కర్లేదు. సో సాయి పల్లవి రిజెక్ట్ చేసే అవకాశం లేదు, అటు సాయి పల్లవి రామాయణ తో హిందీలోకి ఎంట్రీ ఇస్తుంది. అలా నార్త్ లో ఆమె క్రేజ్ కల్కి కి సరిపోతుంది అనేది కల్కి మేకర్స్ ప్లాన్. సో కల్కి 2 లో దీపికా బరువు ని సాయి పల్లవి మోయబోతున్నట్టుగా తెలుస్తుంది.