OG 2 లో అకీరా - చెప్పేస్తే థ్రిల్ ఉండదు

Sun 05th Oct 2025 05:53 PM
akira  OG 2 లో అకీరా - చెప్పేస్తే థ్రిల్ ఉండదు
Sujeeth has dropped an exciting update about OG2 OG 2 లో అకీరా - చెప్పేస్తే థ్రిల్ ఉండదు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వాలి, హీరోగా కనిపించాలనే కోరిక ఆయనకు ఉందొ లేదో తెలియదు కానీ.. పవన్ ఫ్యాన్స్ లో అకీరా ని బిగ్ స్క్రీన్ పై చూడాలనే కోరిక చాలా ఎక్కువే ఉంది. కానీ అకీరా సినిమాల విషయంలో చాలా లైట్ గా ఉంటాడు. థమన్ అకీరా OG మ్యూజిక్ టీమ్ లో ఉన్నాడని చెప్పి హైప్ క్రియేట్ చేసారు. 

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన OG లో అకీరా కనిపించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకోని వారు లేరు. ఇప్పుడు OG కి సీక్వెల్ గా తెరకెక్కబోయే చిత్రంలో అయినా అకీరా ఉండాలని పవన్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. తాజాగా సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు యుఎస్ వెళ్లారు. 

అమెరికా డల్లాస్ లో OG మూవీ ని ఓ థియేటర్ లో అభిమానులతో కలిసి చూసారు. థియేటర్స్ లో ఒక ఫ్యాన్‌ OG ప్రీక్వెల్‌లో అకీరా ఉన్నాడా అని అడిగాడు. దానికి సుజీత్ నవ్వుతూ ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు అంటూ హైప్ పెంచేశాడు. ఈ రిప్లై విన్న ఫ్యాన్స్‌లో కొత్త ఊపు వచ్చింది. దానితో OG సీక్వెల్ లో అకీరా కన్ ఫర్మ్ అంటూ ఫిక్స్ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. 

Sujeeth has dropped an exciting update about OG2:

OG2 with Akira, Sujeeth Delivers a Thrilling Update For Fans

Tags:   AKIRA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ