సౌత్ నుంచి మాయమైపోయి బాలీవుడ్ లోనే సెటిల్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మెల్ బోర్న్ లో విహరిస్తోంది. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఫోటోలకు ఫోజులిస్తూ సెల్ఫీలతో సందడి చేస్తుంది. పూలతో, నేచర్ తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ Dil garden garden ho gaya 🌸🫶 #melbournediaries అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్.
అరుదైన వృక్షాలు, పూలను తాకుతూ మైమరిచిపోతున్న రకుల్ ప్రీత్ లేటెస్ట్ స్టిల్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హిందీ చిత్ర సీమలోనే అవకాశాలు వెతుక్కుంటూ, జిమ్ లో వర్కౌట్స్ చేసుకుంటూ, మధ్య మధ్యలో వెకేషన్స్ కి వెళుతూ, భర్త తో కలిసి పూజలు చేసుకుంటూ రకుల్ అనుక్షణం బిజీగానే కనిపిస్తుంది.
సినిమాలే కాదు రకుల్ ప్రీత్ కి వ్యాపారాలు ఉన్నాయి. అటు భర్త జాకీ భాగాన్ని నిర్మాత కమ్ హీరో. అయితే మెల్ బోర్న్ వెకేషన్ కి రకుల్ ఎవరితో వెళ్లిందో అంటే భర్త తోనా, లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్లిందా అనేది చెప్పలేదు కానీ.. ఆమె ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న సింగిల్ ఫొటోస్ మాత్రమే షేర్ చేసింది.