ఈ బుధవారం వరకు పవన్ కళ్యాణ్ OG హవా థియేటర్స్ లో కనిపించింది. పవన్ కళ్యాణ్-సుజీత్ మూవీకి ప్రమోషన్స్ లేకపోయినా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడానికి OG పై ఉన్న క్రేజే. OG లో పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన రోల్, థమన్ BGM, కొన్ని యాక్షన్ బ్లాక్స్ తప్ప ఏమి లేకపోయినా OG కి సోషల్ మీడియాలో వచ్చిన టాక్, ఫ్యాన్స్ చేసిన పబ్లిసిటీకి OG థియేటర్స్ లో బాగానే నడిచింది.
కానీ ఇప్పుడు కాంతార చాప్టర్ 1 OG కలెక్షన్స్ కి కళ్లెం వెయ్యడంతో OG కి సంబందించిన కొన్ని ఏరియాల లో OG డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం వాటిల్లేలా ఉంది అంటూ కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. నిన్నటివరకు OG ఆహా ఓహో అన్నవాళ్ళే ఇప్పుడు OG నష్టాలు ఇన్ని అన్ని అంటూ లెక్కలు వేస్తూ సోషల్ మీడియాలో రాస్తున్నారు.
కాంతార మిక్స్డ్ టాక్ తో మొదలైనా దసరా హాలిడేస్ సినిమాని నిలబెడతాయి అనడంలో సందేహం లేదు. కాంతార ఊచ కోత తో ప్రతి ఊరిలో అదనపు థియేటర్స్ యాడ్ చేసుకుంటా పోతున్నారు. కాంతార ప్రభావం OG పై ఎంతోకొంత ఉంటుంది అనుకున్నాం కానీ ఈ రేంజ్ లో ఉంటుంది అనుకోలేదు, ఊహించను లేదు అంటూ మాట్లాడుతున్నారు.
థియేటర్స్ లో OG ని వదిలేసి ఆడియన్స్ అందులోను ఫ్యామిలీ ఆడియన్స్ కాంతార ను సెలక్ట్ చేసుకోవడం OG కి బ్యాడ్ అయ్యింది. ఏది ఎలా ఉన్నా OG కలెక్షన్స్ కు కాంతార గట్టిగానే కళ్లెం వేసింది అనే చెప్పాలి.