కొంతమంది హీరోలు, హీరోలనే కాదు హీరోయిన్స్ కూడా సక్సెస్ రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. సక్సెస్ ని ఎంజాయ్ చేసినంతగా ప్లాప్ లను తీసుకోలేరు. ఎప్పుడు హిట్ వెంటే పరుగులు పెట్టాలని తపనపడుతూ ఒత్తిడిని తీసుకోలేరు. కొంతమంది మాత్రం సక్సెస్ ని-ప్లాప్ ను ఒకేలా స్వీకరిస్తారు. ఆలా చేసేవారు చాలా తక్కువమంది ఉంటారు.
కోలీవుడ్ లో గెలుపోటములతో పని లేకుండా సినిమాలు చేసుకుంటూ మధ్య మధ్యలో రేసింగ్ లతో అనుక్షణం బిజీ గా ఉండే అజిత్ కుమార్ తాజాగా తనకు స్లీపింగ్ డిజాడర్ ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తను రోజులో ఎంత కష్టపడినా నాలుగు గంటల కన్నా ఎక్కువ నిద్రపోలేను అంటున్నారు. నాకు నిద్ర రావడం చాలా కష్టం. ఖాళీ సమయంలో, లేదంటే జర్నీ చేసేటప్పుడు నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎంత కష్టపడినప్పటికీ రోజులో 4 గంటలకన్నా ఎక్కువ నిద్ర పోలేను అంటూ అజిత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అంతేకాకుండా రేసింగ్ లో తనకు జరిగిన యాక్సిడెంట్స్ పై మాట్లాడుతూ.. నాకు జరిగిన యాక్సిడెంట్స్ పై వచ్చే ప్రతి న్యూస్ చూస్తాను, ఇలాంటి రేసింగ్స్ లో ప్రమాదాలు జరగడం సహజం. రేసింగ్ లో ఉన్న ఎవరిని అడిగినా గాయాలు అందులో భాగమనే చెబుతారు. రేసింగ్ కార్లను చాలా స్పెషల్ గా తయారుచేస్తారు. డ్రైవర్ భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు.
అందుకే రేసింగ్ కారు యాక్సిడెంట్ అయినా అవి తీవ్రతరం కావు. ప్రాణాలకు ప్రమాదం జరిగే పరిస్థితులు చాలా తక్కువ ఉంటాయి అంటూ అజిత్ చెప్పుకొచ్చారు.