కరూర్ తొక్కిసలాట ఘటన లో 40 మంది చనిపోగా వందలమంది క్షతగాత్రులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ కరూర్ ర్యాలీ లో తొక్కిసలాట ఘటనలో చనిపోయిని వారికి అటు విజయ్ ఇటు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఘటన జరిగిన తర్వాత విజయ్ సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపైన స్పందించారు.
తాజాగా కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో నా గుండె ముక్కలైంది.. మాటలు కావడం లేదు. కరూర్ ఘటన నన్ను కలచివేసింది.. త్వరలో బాధితులను పరామర్శిస్తా, నాపై ఉన్న ప్రేమతో జనం అమితంగా తరలివచ్చారు.
తొక్కిసలాట ఘటనపై నిజం త్వరలోనే బయటకు వస్తుంది, సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు, ప్రతీకారం ఉంటే నాపై తీర్చుకోండి, నా అభిమానులపై కాదు, ర్యాలీకి అన్ని అనుమతులు తీసుకున్నాం.. ఊహించని దుర్ఘటన జరిగింది, మేము ఎలాంటి తప్పిదం చేయలేదు.. మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. త్వరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయంటూ విజయ్ మీడియా ముందు మాట్లాడారు.