సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ఓజీ స్పెషల్ షోని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి .. ఓజీ సూపర్భ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ``మాటలు లేవు.. సూపర్భ్ సూపర్భ్ సూపర్భ్`` అంటూ చిరు ప్రశంసించారు. ఈ ప్రత్యేక షోలో రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా కుటుంబం మొత్తం కనిపించింది. రామ్ చరణ్ సైతం ఓజీ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు.
వైరల్ ఫీవర్ నుంచి నెమ్మదిగా కోలుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవితో పాటు ఈ ప్రత్యేక షోని వీక్షించారు. షో వీక్షించిన అనంతరం అన్నయ్యతో పాటు, పవన్ ప్రసాద్ లాబ్స్ నుంచి వెళుతూ కనిపించారు.
షోలో ఓజీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కూడా కనిపించారు. చిరంజీవి- పవన్ కల్యాణ్- రామ్ చరణ్ ల రాకతో ప్రసాద్ లాబ్స్ లో మీడియా సందడి కూడా ఎక్కువగానే కనిపించింది. ప్రస్తుతం ఓజీ షో నుంచి వెళుతున్న మెగా ఫ్యామిలీ హీరోల ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.