బిగ్ బాస్ హౌస్ లో మాటిమాటికి అంటే చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటున్న రీతూ చౌదరిపై ధర్మ మహేశ్ భార్య గౌతమి చేస్తోన్న ఆరోపణలు వింటే వెక్కి వెక్కి ఎడుస్తుందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. రీతూ చౌదరి తన భర్త ధర్మ మహేశ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ ఆమె వీడియోస్ రిలీజ్ చెయ్యడంతో రీతూ చౌదరికి బయట చాలా బ్యాడ్ అయ్యింది.
అయితే రీతూ చౌదరిపై గౌతమి చేసిన ఆరోపణలపై గౌతమి భర్త, హీరో ధర్మ మహేశ్ స్పందించాడు. నేను రీతూ మంచి ఫ్రెండ్స్, రీతూ చౌదరి చాలా మంచమ్మాయి. నాకు రీతూ కి మద్యన ఏమి లేదు. మా బెడ్ రూమ్ వీడియోస్ రిలీజ్ చేస్తానని గౌతమి బెదిరిస్తోంది. ఉంటే వదలమని చెప్పండి. గౌతమి నా కొడుకుని నాకు చూపించడం లేదు. నేను డిప్రెషన్లో ఉన్నాను. సెటిల్మెంట్ చేస్తే నా కొడుకును చూపిస్తామన్నారు.
ఎన్నో ఏళ్ళు కష్టపడి ఈస్థాయికి వస్తే నా పేరును నాశనం చేసింది. తను అన్నీ అబద్ధాలే చెప్తోంది. రీతూ-నేను డ్రగ్స్ తీసుకున్నామని వీడియోస్ రిలీజ్ చేస్తుంది. నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు.. అంటూ ధర్మ మహేశ్ చెప్పుకొచ్చాడు.