సినిమాలు చూసి యువత చెడిపోతుందా? అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం `అవును` అని చెప్పడం కష్టం. కానీ సినిమాలు చూసి యూత్ ప్రభావితం అవుతోందనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. తమ అభిమాన హీరోని అనుకరించడానికి యువతరం ఎప్పుడూ వెనకాడదు. ఇప్పుడు దిల్లీకి చెందిన 24 ఏళ్ల యువకుడు కేజీఎఫ్ రాఖీ భాయ్ లా గన్ చేతబట్టి గ్యాంగ్ స్టర్ గా మారాడు. అతడు తనను తాను మాఫియా డాన్ గా ఊహించుకుని వీధుల్లో హల్ చల్ చేసాడు. అతడు తనకంటూ ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని గ్యాంగ్ వార్ లకు తెర తీసాడు. ఇదంతా వినేందుకు ఓజీ కథలా అనిపించినా కానీ, ఇది నిజం. అతడు ఎప్పుడూ బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాలు చూస్తుంటాడు. వాటి ప్రభావం కూడా ఆలా ఎక్కువ.
అయితే ఈ ఓజీ స్టోరీలో ఊహకు అందని ట్విస్టులు ఉన్నాయి. అతడి గ్యాంగ్‌స్టర్ యాక్టివిటీస్ కి దిల్లీ పోలీస్ లు షాక్ తిన్నారు. చివరికి దర్యాప్తు చేపట్టి అతడి యాక్టివిటీస్ అన్నిటికీ చెక్ పెట్టేశారు. నిండా పాతిక అయినా నిండని యువకుడికి ఇరవైకి పైగా దోపిడీలు, దొంగతనాలు, హత్యా యత్నాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. అలాగే క్రైమ్ లో ఉన్న ఇతర గ్యాంగ్ లను బెదిరించి డబ్బులు గుంజాడని కూడా ఇతడిపై కేసులు ఉన్నాయి.
అయితే ఈ కథలో ప్రధానమైన ట్విస్టు ఏమంటే, అతడు సినిమాలు చూసి గ్యాంగ్‌స్టర్ అవ్వాలనుకున్నాడు. తాను ఏం చేయాలనుకున్నాడో దానిని చేసి చూపించాడు. కానీ నిజ జీవితంలో ఫాంటసీలు అన్నివేళలా వర్కవుట్ కావని అతడి విషయంలో ప్రూవ్ అయింది. ప్రస్తుతం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేసారు. కటకటాల్లో ఊచలు లెక్కిస్తూ ధీనావస్తలో ఉన్నాడు.