Advertisementt

OG మూవీ స్క్రీన్ చించేసిన ఫ్యాన్స్

Thu 25th Sep 2025 01:48 PM
og  OG మూవీ స్క్రీన్ చించేసిన ఫ్యాన్స్
Pawan Fans Tear The Screen With OG Sword OG మూవీ స్క్రీన్ చించేసిన ఫ్యాన్స్
Advertisement
Ads by CJ

గత రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్ర ప్రీమియర్స్ వేసిన థియేటర్స్ దగ్గర ఆయన అభిమానులు ఎంతగా రచ్చ చేసారో చూసాం, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనూ, ఓవర్సీస్ లోను పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.  

అయితే కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హద్దుమీరిపోయారు. బెంగుళూరులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OG సినిమా ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న థియేటర్ స్క్రీన్ ని కత్తితో కోసేయ్యడం హాట్ టాపిక్ గా మారింది. దానితో యాజమాన్యం OG సినిమా షో ని అర్దాంతరంగా ఆపేసారు. 

బెంగళూరులోని KR పురం థియేటర్ లో OG ప్రీమియర్ ప్రదర్శిస్తున్న సమయంలో ప్రీమియర్స్ చూసేందుకు వచ్చిన పవన్ అభిమానులు కత్తితో స్క్రీన్ చింపెయ్యడంతో థియేటర్ యాజమాన్యం షో ని నిలివేసారు. మరి అభిమానం ఉండొచ్చు కానీ స్క్రీన్ చింపేసేంత అంత అతి పనికిరాదు... ఈ ఫ్యాన్స్ ఎప్పటికి తెలుసుకుంటారో మరి. 

Pawan Fans Tear The Screen With OG Sword:

OG Screening In Bangalore Stopped After Pawan Fans Tear Screen With Sword

Tags:   OG
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ