గతంలో హైదరాబాద్ లో క్రౌడ్ మధ్యన సెలబ్రిటీస్ సినిమాలు చూడాలంటే నగర నడిబొడ్డున ఉన్న RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లేదంటే కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ కి వెళ్లేవారు. అక్కడ అభిమానుల మధ్యన సినిమాలు చూసేందుకు హీరోలు అయినా చిత్ర బృందం అయినా ఎక్కువ ఉత్సహం చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం లెక్క మారింది.
ఇప్పుడు హైదరాబాద్ సెలబ్రిటీస్ ప్రత్యేకంగా సినిమాలు చూడాలంటే కొండాపూర్ లో మహేష్ AMB మాల్ ఆతర్వాత మైత్రి వాళ్ళు నిర్మించిన బాలానగర్ వవిమల్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. నిన్న బుధవారం నైట్ OG ప్రీమియర్స్ కోసం OG చిత్ర బృందంలోని హీరోయిన్ ప్రియాంక, శ్రీయ రెడ్డి, దర్శకుడు సుజిత్ వైఫ్ ఇలా కొంతమంది సెలబ్రిటీస్ మహేష్ AMB లో సందడి చేసారు.
సాయి ధరమ్ తేజ్ మాత్రం శ్రీరాములు థియేటర్స్ లో రచ్చ చేసాడు. ఇక బాలానగర్ మైత్రి వారి విమల్ థియేటర్ కి పవన్ కొడుకు అకిరా, కూతురు ఆద్య, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మెగా హీరోలు వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్, ప్రొడ్యూసర్స్ SKN, దర్శకుడు హారిష్ శంకర్ ఇలా సినీ ప్రముఖులు OG చిత్రాన్ని వీక్షించేందుకు విమల్ థియేటర్ కి రావడం చూసి హైదరాబాద్ లో ఆ రెండు థియేటర్స్ స్పెషల్ అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.