బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ప్రస్తుతం ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. కంటెస్టెంట్స్ కి తమ ఇళ్ల వద్ద నుంచి తల్లి తండ్రులు లెటర్స్ పంపించారని, అలాగే ఫోటో ఫ్రేమ్స్ కోసం హౌస్ లోని బ్యాటరీ ఛార్జ్ తగ్గేలా ప్లాన్ చేసాడు బిగ్ బాస్. ఇమ్మాన్యువల్ బజర్ కొట్టి మొదటగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లగా తండ్రి లెటర్, తల్లి వాయిస్ మెసేజ్, ఫోటో ఫ్రేమ్ అంటూ బిగ్ బాస్ బ్యాటరీ ఛార్జ్ కోసం బేరం పెట్టాడు. దానితో ఇమ్మాన్యువల్ ఎమోషనల్ అయ్యాడు.
తర్వాత తనూజా కూడా ఫ్యామిలీ మెంబెర్స్ పంపించిన గిఫ్ట్ కోసం ఎమోషనల్ అవగా.. నిన్నటి ఎపిసోడ్ లో ప్రియా, సంజనలలో ఎవరు ముందుగా బజర్ కొట్టారు అనగానే సంచాలక్ శ్రీజ.. సంజన పేరు చెప్పగానే ప్రియా ఆమెపై అరిచి ఎమోషనల్ అవడంతో శ్రీజ సరే నువ్వే బజర్ కొట్టావ్ అంటూ ప్రియా పేరు బిగ్ బాస్ కి చెప్పింది.
దానితో వారి మద్యన గొడవ జరిగింది, అదే ఫ్యామిలీ ఎమోషన్స్ లో సుమన్ శెట్టిని కూడా ఇరికించాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన రెండు వారాలకే తమ ఫ్యామిలీ మెంబెర్స్ ని మిస్ అవుతున్నట్టుగా ఎమోషనల్ డ్రామా పండించారు.