వయసు 75.. ఆ వయసులో పడక కుర్చీలో కూర్చుని భార్య అయినా, కోడలు అయినా చాయ్ ఇస్తే తాగి పేపర్ చదువుకుంటూ రెస్ట్ తీసుకునే వారు చాలామంది ఉంటారు. ఎక్కడో రేర్ గా ఆ వయసులోనూ యాక్టీవ్ గా కనిపిస్తారు. 60 ఏళ్లకే బస్ ఎక్కాలన్నా, ఆటో ఎక్కాలన్నా, కార్ ఎక్కాలన్నా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు మరికొందరు. ఒకరోజు జర్నీ చేస్తేనే ఒళ్ళు హూనమైపోయి మంచానికి అతుక్కుపోతూ ఉంటారు చాలామంది. కానీ 75 అనేది జస్ట్ నెంబర్ మాత్రమే.. మనలోని ఎనేర్జి ఏమాత్రం తగ్గలేదు అని ఏపీ సీఎం చంద్రబాబు తరచూ నిరూపిస్తూనే ఉన్నారు.
75 ఏజ్ లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాదు ఆయన తన ఎనర్జీ తో పార్టీలోను, కార్యకర్తల్లోనూ ముఖ్యంగా అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. నిన్న బుధవారం సీఎం చంద్రబాబు షెడ్యూల్ చూసి అందరూ ఆయనకు తప్ప ఇది ఎవరికీ సాధ్యం కాదేమో అని మాట్లాడుకుంటున్నారు.
పొద్దున్నే అసెంబ్లీ సమావేశాల్లో… మధ్యాహ్నం భార్య నారా భువనేశ్వరి తో కలిసి రామానాయుడు గారి కుమార్తె పెళ్లిలో పాల్గొని… తరువాత విజయవాడలో దసరా ఉత్సవాలకు విచ్చేసిన ఉపరాష్ట్రపతిని ఆహ్వానించిన చంద్రబాబు అదే రోజు సాయంత్రం ఫ్యామిలీతో కలిసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామివారి బ్రహ్మోత్సవాలకు పట్టుబట్టలు సమర్పిస్తూ కనిపించారు.
ఇదంతా ఒకే రోజులో… రాజకీయాలు అనే పదవిని ఆశించలేదు, ప్రజల సేవ అనే బాధ్యతను ఆచరిస్తున్నారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తూ, ఒక్క అడుగూ వెనక్కి వేయలేదు. గీత దాటలేదు… స్వధర్మం పాటిస్తున్నారు… పరధర్మాన్ని గౌరవిస్తున్నారు… అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు.