తెలంగాణాలో పవన్ కళ్యాణ్ OG చిత్రానికి విడుదలకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24 నైట్ 9 గంటలకే బెనిఫిట్ షో వేసుకునే వెసులుబాటు కల్పించడమే కాదు దానికి 800 టికెట్ రేట్ ని ఫిక్స్ చేసింది ప్రభుత్వం. కానీ ఏపీలో OG ప్రీమియర్స్ కి ప్రభుత్వం మిడ్ నైట్ 1 గంట షో కి అనుమతి ఇచ్చింది. దాని కోసం 1000 రూపాయల టికెట్ రేట్ ఫిక్స్ చేసింది.
తెలంగాణాలో పవన్ ఫ్యాన్స్ OG ప్రిమియర్ ముందు రోజే చూసేందుకు ఉర్రుతలూగిపోతుంటే.. ఏపీ లోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. తొమ్మిది గంటల షో తమకుకూడా కావాలన్నారు. మిడ్ నైట్ 1 గంటకన్నా ముందే OG ని చూడాలని వారు ఆశపడుతున్నారు. ఇప్పుడు వారి ఆశను తీర్చేసారు.
ఏపీలో 25 తెల్లవారు ఝామున 1 గంట బెనిఫిట్ షో ని క్యాన్సిల్ చేసి ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24 నైట్ 10 గంటలకు బెనిఫిట్ షో వేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారి చేసింది. సో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల అభిమానులు OG ని అటు ఇటుగా ఒకే సమయంలో చూసి ఎంజాయ్ చేస్తారన్నమాట.