బిగ్ బాస్ సీజన్ 9 మొదలై రెండు వారాలైంది. హౌస్ లోకి వెళ్లిన 15 మందిలో మొదటివారం సెలబ్రిటీస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అవ్వగా, రెండో వారం కామనర్స్ నుంచి మంచి మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక మూడో వారం హౌస్ లో నామినేషన్స్ హీట్ మొదలైంది. సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ వేడి రాజుకుంది.
మూడో వారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సూపర్ పవర్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి అర్హత లేని సభ్యుడిని నేరుగా నామినేట్ చేయవచ్చని సూచించడంతో కంటెస్టెంట్లు చెలరేగిపోయారు. టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్‌లో నలుగురిని నామినేట్ చేసుకోవాలి. అలాగే ఓనర్లలో ఒకరిని ఓనర్లు నామినేట్ చేసుకోవాలని సూచించారు.
శ్రీజ, హరిత హరీష్, ప్రియాశెట్టి, సంజన, ఫ్లోరా సైనీ, ఇమ్మాన్యుయేల్, భరణి వీళ్లంతా ఈ నామినేషన్స్ ప్రక్రియలో హోరా హోరీగా గొడవపడినారు. ఈ వారం నామినేషన్స్ లో 6 గురు నిలిచినట్లుగా లీక్స్ చెబుతున్నాయి. రాము రాథోడ్, రీతూ చౌదరీ, ప్రియా, హరిత హరీష్, కల్యాణ్, ఫ్లోరా షైనీ నామినేట్ అయినట్లుగా తెలుస్తుంది.