మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి తో మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా వున్నారు. విశ్వంభర షూటింగ్ ఫినిష్ అయ్యి VFX వర్క్ లో వసిష్ఠ బిజీగా ఉంటే.. చిరు ప్రస్తుతం అనిల్ రావిపూడి చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దసరా కి దర్శకుడు బాబీ తో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారు.
అయితే మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రిల్ మాస్టర్ గా శంకర్ వరప్రసాద్ పాత్రలో చిరు కనిపించనున్నారు. అయితే వెంకటేష్.. అనిల్ రావిపూడి-చిరు మన శంకర వరప్రసాద్ గారు సెట్ లోకి అక్టోబర్ 20 నుంచి జాయిన్ అవుతారు అని తెలుస్తోంది.
పది రోజులు షూట్ లో వెంకీ పాల్గొనబోతున్నారు. చిరు-వెంకీ నడుమ కీలక సన్నివేశాలు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తారని తెలుస్తుంది. దానితో పాటుగా నవంబర్ లో మరో షెడ్యూల్ లో చిరు-వెంకీ ఇద్దరిపై ఒక సాంగ్ తెరకెక్కిస్తారట. చిరు-వెంకీ కాంబో సీన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తాయని టీమ్ కాన్ఫిడెంట్ గా చెబుతుంది.