OG ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అంతగా మేకర్స్ OG ట్రైలర్ రిలీజ్ ని వాయిదా వేస్తూ రావడంతో పవన్ ఫ్యాన్స్ అసహనంగా కనిపించారు. ఇక అనుకోని పిడుగులా ఈరోజు సోమవారం OG ట్రైలర్ ని వదిలారు మేకర్స్. OG ట్రైలర్ లోకి వెళితే..
ఓజాస్ గంభీర గా పవన్ కళ్యాణ్ సింహగర్జన కు విలన్ ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ లాంటి వాళ్ళు ఒణికి పోవడం కాదు బాంబే వస్తున్నా అంటూ ఓజాస్ గంభీర గర్జించడం ఈ ట్రైలర్ కే హైలెట్. పవన్ కళ్యాణ్ ని ఓజాస్ గంభీర లాంటి బలమైన కేరెక్టర్ లో చూసి ఎన్నో ఏళ్ళు అవడంతో అభిమానులకు పవన్ లుక్స్ కి, ఆయన పవర్ ఫుల్ కేరెక్టర్ చూసి పూనకాలు తెచ్చుకుంటున్నారు.
గ్యాంగ్ స్టర్ గా తప్పు చేసిన వాడి తల నరికే ఓజాస్ గంభీర ముంబై వెళ్లి రక్తాన్ని ఏరులై పారించడం వెనుక అసలు కథ ఏమిటి అనేది సస్పెన్స్ లో పెట్టి ట్రైలర్ కట్ చేసారు. సుజీత్ ఈ ట్రైలర్‌ను భారీ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా మరియు స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో అభిమానులకు కావాల్సినంత ట్రీట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వింటేజ్ లుక్స్, విలన్ ఇమ్రాన్ హష్మీ కేరెక్టర్, అర్జున్ దాస్ కేరెక్టర్, హీరోయిన్ ప్రియాంక మోహన్ కేరెక్టర్ అన్ని చాలా బలంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్-ఇమ్రాన్ హష్మీ పాత్రల మధ్య జరిగే యాక్షన్ తో పాటుగా థమన్ BGM, సినిమాటోగ్రఫీ, దానయ్య ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని OG ట్రైలర్ కి హైలెట్ గా నిలిచాయి.