Advertisementt

PVCU నుంచి అధీర

Mon 22nd Sep 2025 11:43 AM
adhira  PVCU నుంచి అధీర
Adhira Shoot in Progress PVCU నుంచి అధీర
Advertisement
Ads by CJ

హనుమాన్ తర్వాత ఆకాశమంత క్రేజ్ సంపాదించుకుని జై హనుమాన్ అంటూ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ లో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు దానయ్య కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి అధీర ను తీసుకురాబోతున్నాడు. 

యూనిక్, లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ, లార్జర్-దాన్-లైఫ్ సూపర్ హీరో సినిమా కోసం ఆర్.కె.డి స్టూడియోస్ తో కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్‌ ఫిల్మ్‌తో అలరించిన ఆయన, తర్వాత ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ తో సంచలనాన్ని సృష్టించారు. అదే డ్రీంని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా వస్తోంది అధీర. 

అధీ లో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తుండగా, కీలక పాత్రలో ఎస్. జే. సూర్య కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రివాజ్ రమేష్ దుగ్గల్ నేతృత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా వస్తున్న ఈ చిత్రం, భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో, గ్రేట్ విజువల్స్‌తో రూపొందుతుంది. ప్రతి కథా వైవిధ్యంగా, ఒకే యూనివర్స్‌లో బ్లెండ్ అయ్యేలా  ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో డ్రీమ్‌ యూనివర్స్‌కు బలమైన పునాది వేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఎస్. జే. సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

బ్యాక్‌డ్రాప్‌లో ఒక అగ్నిపర్వతం పేలుడు, మంటలు, లావా, బూడిద ఆకాశాన్ని కప్పేస్తాయి. ఆ కల్లోలంలోనుంచి ఎస్. జే. సూర్య బుల్‌ లాంటి కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నారు. తని ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్లపై కూర్చుని ధైర్యంతో పైకి చూస్తూ మోడరన్ వార్ అవతార్ లో ట్రూ సూపర్ హీరోలా కనిపించారు. అధీర పోస్టర్ ఒక మహా సంగ్రామానికి నాంది పలికింది

ఇది ఆశ vs అంధకారం మధ్య యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్‌ని ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్‌, స్టంట్స్‌, గ్రేట్ విజువల్స్‌, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా థియేటర్స్ లో థండర్‌క్లాప్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించబోతోంది

Adhira Shoot in Progress:

Adhira Shoot update

Tags:   ADHIRA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ