పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేసారు, సినిమా షూటింగ్ ఫినిష్ అవుతోంది అంటూ దానయ్య ఇంకా దర్శకుడు సుజీత్ కాన్ఫిడెంట్ తో OG సినిమా విడుదల తేదీని లాక్ చేసేసి అధికారికంగా డేట్ వదిలేసారు. తీరా చూస్తే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాక సుజిత్ ఇంకా ఇంకా అంటే సినిమా విడుదల తేదీ ముందు రోజు కూడా OG వర్క్ చేసేలా కనిపిస్తున్నాడు.
కేవలం OG కి రెండు రోజులే సమయముంది. ఇప్పటివరకు ట్రైలర్ లేదు.. నిన్న ఆదివారం OG ట్రైలర్ అంటూ ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. DI అవ్వలేదు, కొన్ని సీన్స్ యాడ్ చెయ్యాలి, పవన్ కళ్యాణ్ మార్పులు చెయ్యమన్నారు అంటూ ట్రైలర్ వదల్లేదు. దానితో పవన్ ఫ్యాన్స్ లో OG ట్రైలర్ చూడలేదు అనే దిగులు కన్నా మరో ఆందోళన మొదలైంది.
ట్రైలర్ విషయమే సుజిత్ ఇలా చేస్తే హడావిడిగా సినిమా రిలీజ్ చేసేసి దెబ్బేయ్యరు కదా, OG సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉన్నాం, సకాలంలో పనులు పూర్తి కాకపోతే సినిమా రిలీజ్ కాస్త వాయిదా వేసుకుంటే సరిపోయేది. కానీ ఇంత హరీబరిగా రిలీజ్ చేసి ఏదైనా తేడా కొడితే ఎవరిది బాధ్యత అంటూ వారు మధనపడిపోతున్నారు.
నిజమే సుజిత్ OG ట్రైలర్ విషయంలోనే ఇలా ఉంటే అవుట్ ఫుట్ ఎలా ఇస్తాడో అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.