భైరవం, మిరాయ్ చిత్రాల తర్వాత మంచు మనోజ్ ఎంతగా సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తున్నాడు అంటే.. ఎక్కడ చూసినా మంచు మనోజే అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొన్ని నెలల క్రితం ఫ్యామిలీ ఇష్యుస్ తో మీడియా ముందు కనబడిన మంచు మనోజ్ ఇప్పుడు చాలా మెచ్యురిటి పర్సన్ లా మాట్లాడుతున్నాడు.
తొమ్మిదేళ్లు నటనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తను సోలోగా మొదలు పెట్టిన సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు మొన్న వినాయకచవితి ఈవెంట్స్ లో టివి షోస్ లో సందడి చేసిన మంచు మనోజ్ ఇప్పుడు దసరా ఈవెంట్స్ లో హడావిడి మొదలు పెట్టాడు.
జీ తెలుగు అవార్డ్స్, స్టార్ మా దసరా ఈవెంట్ లో మంచు మనోజ్ సందడి చెయ్యబోతున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ - బాబీ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తాడని ప్రచారము ఉంది. మరి ఇకపై మంచు మనోజ్ కేరీర్ ఎలా ఉంటుందో, ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సి.