బాలీవుడ్ హీరోయిన్స్ అయినా, మిగతా హీరోయిన్స్ అయినా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలను ప్లాన్ చేసుకుంటే వెంటనే అభిమానులతో ఆ గుడ్ న్యూస్ ను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడతారు. అలియా భట్, దీపికా, కియారా ఇలా ప్రతి హీరోయిన్ ఆ గుడ్ న్యూస్ ను రివీల్ చేసారు.
కానీ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ లు ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాస్తున్నారా, అసలు ఎందుకింత దాపరికం. పిల్లలు పుట్టాక మళ్లీ ఫిట్ గా మారి సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కరీనా, అలియా భట్, దీపికా ఇలా ప్రతిఒక్కరు ఇంకా ఇంకా టాప్ పొజిషన్ లోనే ఉన్నారు. మరి కత్రినా జంట ఎందుకు భయపడుతుంది.
గత వారం రోజులుగా బాలీవుడ్ మీడియాలో కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్, ఆమె త్వరలోనే తల్లి కాబోతుంది.. అక్టోబర్ కానీ, నవంబర్ కానీ ఈ జంట పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యి గుడ్ న్యూస్ చెప్పేస్తారు అంటూ వార్తలు రావడం, విక్కీ కౌశల్ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేయ్యడం చూసాం. ఈలోపే కత్రినా ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ అంటూ కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి.
అవి చూసాక కత్రినా జంట గుడ్ న్యూస్ చెప్పడానికి ఎందుకింతగా ఆలోచిస్తుంది, అసలు ఎందుకింత దాపరికం అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.