పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా విడుదలకు సమయం ఏంతో లేదు. గురువారం సెప్టెంబర్ 25 అంటే మరో మూడు రోజులు మాత్రమే ఉంది. ఈరోజు ఆదివారం ఉదయమే OG ట్రైలర్ అంటూ మేకర్స్ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. కానీ అనుకున్న సమయానికి OG ట్రైలర్ రాలేదు, దానితో OG ట్రైలర్ ఈవెనింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వదులుతారన్నారు. అది కూడా జరగలేదు.
ఈరోజు ఆదివారం సాయంత్రం LB స్టేడియం లో వేలాదిమంది అభిమానుల నడుమ ఎన్నో అంచనాలు తో మొదలైన OG ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వర్షం కారణంగా ఆటంకం ఏర్పడినా పవన్ కళ్యాణ్ ఇంకా OG టీమ్ గొడుగేసుకుని మరీ ఈవెంట్ లోకి వచ్చారు. పవన్ తను సినిమాలో పాడిన పాట పాడుతూ అభిమానుల్లో జోష్ నింపారు.
అయితే OG ట్రైలర్ వదలకపోవడంపై అభిమానులు ఎక్కడ ఆగ్రహంగా ఉంటారో అని పవన్ ముందుగానే సుజిత్ ట్రైలర్ ఏదయ్యా అని అడిగితే.. DI అవ్వలేదు అందుకే రిలీజ్ చెయ్యలేదు అన్నారు. కానీ పవన్ నాకు ట్రైలర్ కావాల్సిందే. OG Trailer ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లేదు ట్రైలర్ ప్లే చేయండి. DI మా వాళ్ళు చూసుకుంటారు... మీరు ఈరోజు రిలీజ్ చేయాల్సిందే అని పవన్ పట్టుబట్టారు.
అంతేకాదు జల్సా లో ఓ డైలాగ్ ఉంటది కదా.. సంజయ్ సాహు కి కు ఏది తేలిగ్గా రాదు, అలాగే పవన్ కళ్యాణ్ కి ఏది ఊరికినే రాదు, ఎన్ని ఇబ్బందులు.. సెన్సార్ అంటారు, ఇంకోటి ఇంకోటి ఇవన్ని అదిగమించి 25 న వస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను శాంతపరిచారు.