బిగ్ బాస్ సీజన్ 9లోకి సెలబ్రిటీస్ vs కామనర్స్ అంటూ ఓ 15మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ లో రెండు హౌస్ లు అందులో ఓనర్స్, టెనెంట్స్ అంటూ బిగ్ బాస్ కామనర్స్ ను ఓనర్స్ గాను, సెలబ్రిటీస్ ని టెనెంట్స్ గా మార్చి వారితో టాస్క్ లు ఆడిస్తున్నారు. కామనర్స్ లో హరిత హారిష్, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, పవన్, మనీష్ లు ఉన్నారు.
సెలబ్రిటీస్ లో సుమన్ శెట్టి, భరణి, రీతూ, తనూజ, సంజన, ఫ్లోరా షైనీ, రాము, ఇమ్మాన్యువల్ లు ఉన్నారు. శ్రష్టి వర్మ గత వారం ఎలిమినెట్ అయ్యింది. ఈ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అవుతున్నాడు. అయితే ఈ వారం నాగార్జన హౌస్ లో బోరింగ్ పర్సన్ ఎవరు అనే టాస్క్ ని ఆదివారం పెట్టగా..
అందరూ ఫ్లోరా షైనీ పేరు చెప్పారు. ఫ్లోరా హౌస్ లో తన పనేదో తను చేసుకుంటూ సైలెంట్ గా అంటే కొంతమందితో మాత్రమే కనెక్ట్ అయ్యింది. హరిత హరీష్ తోనూ కాస్త మాట్లాడేది, అయితే మొదటి వారం సంజనతో గొడవపడిన ఫ్లోరా రెండో వారం ఆమెతో ఫ్రెండ్ షిప్ చేసింది. కానీ ఆమె ఒంటరిగా సైలెంట్ గా ఉండడంతో ఆమెను బోరింగ్ అంటూ హౌస్ మొత్తం అందులో ఒక్క తనూజ తప్పితే అందరూ ఓటేశారు.




AA 22 లో అదే హైలెట్ 

Loading..