అల్లు అర్జున్-అట్లీ కలయికలో ఇంటర్నేషనల్ రేంజ్ లో మొదలైన AA 22 ప్రాజెక్ట్ పై విపరీతమైన అంచనాలున్నాయి. సినిమా అనౌన్సమెంట్ తోనే ఇంటర్నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యేలా హాలీవుడ్ రేంజ్ లో అనౌన్స్ చేసాడు అట్లీ. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్ట్, అంతకుమించి అల్లు అర్జున్ యాక్టింగ్ తో AA 22 తెరకెక్కబోతుంది.
ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ కోసం AA 22 టీం దుబాయ్ లోని అబుదాబిని ఎంచుకుంది. అక్కడ అరుదైన లొకేషన్స్ లో AA 22 కి సంబందించిన యాక్షన్ సీన్స్ ని అట్లీ డిజైన్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం అల్లు అర్జున్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.
ఈ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని, ఈ సీక్వెన్స్ ఎపిసోడ్ AA 22 కి మెయిన్ హైలెట్ గా నిలిచిపోతుందని, మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్ కాగా.. మరో ముగ్గురు హీరోయిన్స్ అల్లు అర్జున్ తో రొమాన్స్ చెయ్యబోతున్నారు.