బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్స్ vs సెలబ్రిటీస్ అంటూ బిగ్ బాస్ గేమ్ ఆడిస్తున్నాడు. కామనర్స్ అయితే రెచ్చిపోయి సెలబ్రిటీస్ పై గెలిచెయ్యాలని ఓవర్ చేస్తున్నారు. ఆ ప్రియా, దమ్ము శ్రీజ ల ఓవరేక్షన్ భరించలేక చస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. ఇక ఈ వారం రీతూ తప్పిదం వలన కెప్టెన్ అయిన పవన్ కెప్టెన్సీని వీకెండ్ లో నాగార్జున లాగేసుకున్నారు. పవన్ తాను సంచాలక్ ఫెవరిజం వల్ల కెప్టెన్ అయ్యాను, నాకు ఈ కెప్టెన్సీ వద్దు అన్నాడు.
ఇక రేపు ఆదివారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారో అనే విషయం అప్పుడే లీకైపోయింది. ఈ వారం నామినేషన్స్ లో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ, హరీశ్, మనీష్, ప్రియ, పవన్.. ఉన్నారు. ఈ వారం ఓటింగ్ లో సుమన్ శెట్టి దుమ్మురేపాడు.
కానీ లీస్ట్ ఓటింగ్ తో మర్యాద మనీష్ కనిపించాడు. అగ్నిపరీక్షలో గెలిచి శ్రీముఖి ద్వారా హౌస్ లోకి వచ్చిన మర్యాద మనీష్ రెండు వారాలుగా హౌస్ లో చేసింది ఏమి లేకపోవడం ఆడియన్స్ కు కూడా చిరాకొచ్చి మర్యాద మనీష్ ని ఎలిమినేట్ చేసారు. ఫుడ్ విషయంలో శనివారం ఎపిసోడ్ లో మర్యాద మనీష్ ని నాగార్జున ఏకిపారేశారు. ఫైనల్ గా రెండు వారాలకే మర్యాద మనీష్ బిగ్ బాస్ జర్నీ ముగిసింది.