గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ అఖండ 2: తాండవంతో రాబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో అదిరిపోయే మాస్ డాన్స్ నంబర్‌ను షూట్ చేస్తున్నారు. 600 మంది డాన్సర్లతో ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
అఖండలో జై బాలయ్య’ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్, ఇప్పుడు ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు. తమన్ అద్భుతమైన మాస్ నెంబర్ కంపోజ్ చేశారు. బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నారు. ఈ పాట థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతోంది.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులని ప్రేక్షకులని కట్టిపడేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె కూడా స్టోరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.