ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల దునియా మొత్తం OG కోసం వెయిట్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే OG OG అంటూ ఊగిపోతున్నారు. ఓవర్సీస్ లో OG మ్యానియా చూస్తే దిమ్మతిరుగుతుంది. అంతలా OG క్రేజ్ కనిపిస్తుంది. సెప్టెంబర్ 25 తెల్లవారుఝాము నుంచే OG విధ్వంశం మొదలైపోతుంది. తెలంగాణాలో అయితే సెప్టెంబర్ 24 నైట్ 9 కె OG షో పడిపోతుంది.
OG విధ్వంశం ఓకే కానీ ప్రమోషన్స్ ఎక్కడ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. OG మేకర్స్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 25 న సినిమా అంటే 21 న ట్రైలర్ వదలడమేమిటి, ఇప్పుడు ట్రేడ్ లోను, ఆడియన్స్ లోను OG పై ఉన్న క్రేజ్ చాలనుకుంటున్నారా, అందుకే ప్రమోషన్స్ చెయ్యడం లేదా అంటూ పవన్ ఫ్యాన్స్ ఎగురుతున్నారు.
ప్రస్తుతం ఉన్న క్రేజే OG ని పైకి లేపుతుంది అనుకుంటున్నారా, హరి హర వీరమల్లు అప్పుడు హడావిడి చేసిన పవన్ OG విషయం పట్టించుకోకపోవడము పవన్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతుంది. పవన్ కూడా వీరమల్లు మాదిరి మీడియా ముందుకు వస్తే OG హైప్ మరింత పెరుగుతుంది అనేది పవన్ ఫ్యాన్స్ వాదన, కానీ పవన్ ప్రస్తుతం OG ని పక్కనపెట్టి అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా వున్నారు.