బిగ్ బాస్ సీజన్ 9 రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి హౌస్ లో డిమోన్ పవన్ కెప్టెన్సీ ని గెలుచుకున్నాడు. గత వారం హౌస్ నుంచి శ్రష్టి వర్మ మొదటి ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయింది.
ఇక ఈవారం నామినేషన్స్ లో భరణి శంకర్, ఫ్లోరా షైనీ, హరిత హరీశ్, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, సుమన్ శెట్టిలు, డిమోన్ పవన్ లు ఉన్నారు. వీళ్ళలో తొలి వారం సుమన్ శెట్టి ఓటింగ్ లో అద్దరగొట్టినట్టుగానే రెండో వారంలోనూ సుమన్ శెట్టి ఓటింగ్‌లో దుమ్మురేపుతున్నాడు.
దాదాపు 42 శాతం ఓటింగ్‌తో సుమన్ శెట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత భరణి, ఫ్లోరా షైనీ, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి తో నిలిచారు. ఇక ఈ వారం ఫ్లోరా షైనీ, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియాలు ఈ వారం డేంజర్ జోన్‌లో నిలిచారు. మరి రెండో వారం బిగ్ బాస్ 9 హౌస్ నుంచి కామనర్స్ వెళతారా, లేదంటే సెలబ్రిటీస్ వెళతారా.. ఇంతకీ ఎలిమినేట్ అయ్యి ఎవరు బయటికి వెళతారో చూడాలి.