మంచు ఫ్యామిలిలో అన్నదమ్ములు, తండ్రీకొడుకుల నడుమ ఎంతగా గొడవలు జరిగాయో, మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, మోహన్ బాబు జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడం, ఆయన అనారోగ్యం పాలవడం, మంచు విష్ణు సైలెంట్ గా చెయ్యాల్సినది చెయ్యడం శంషాబాద్ దగ్గరలోని జల్ పల్లి ఫామ్ హౌస్ ముందు మనోజ్ ధర్నా చేయడం.. ఇలా ఇంత రచ్చ జరిగినా మంచు లక్ష్మి ఈ గొడవల్లోకి ఎంటర్ అవడం కానీ, ఆమె ఈ ఫ్యామిలీ ఇష్యుపై మాట్లాడడం కానీ చెయ్యలేదు.
తాజాగా ఆమె దక్ష ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం ఫ్యామిలిలో ఎవరికి సక్సెస్ వచ్చినా తామంతా సంతోషంగా ఉంటామని, మిరాయ్ హిట్ ని తమ్ముడు మనోజ్ తో కలిపి ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పిన మంచు లక్ష్మి మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న గొడవలపై స్పందించింది.
ఏ ఫ్యామిలిలో అయినా చిన్న చిన్న గొడవలు ఉండకుండా ఉండవు. ఒక కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఫ్యామిలిలో ఉన్న అందరూ నలిగిపోతారు. అలా జరగదు అని చెప్పడం అబద్ధం. మేము ఉండేది అద్దాల మేడలో.. మేము ఏం చెప్పినా అది నిజమా, కాదా అనేది ఆలోచించకుండా తల, తోక కట్ చేసి వాళ్లకు నచ్చినట్లు రాసుకునే రోజులివి. అలాంటప్పుడు ఆ ఇష్యుస్ పై రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉండడమే ఉత్తమం.
అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. గతంలో అయితే ఏది ఒప్పు, ఏది తప్పు అని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. దీని వల్ల నేను ఆనందంగా ఉంటానా, బాధపడతానా అని ఆలోచిస్తున్నాను. ఏది ఏమైనా సైలెంట్ గా ఉంటేనే మనకు కాస్త ప్రశాంతత వస్తుంది అంటూ మంచు ఫ్యామిలీ గొడవల విషయంలో లక్ష్మి ఇలా స్పందించింది.