హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ ఓపెనింగ్ అప్ డేట్ తప్ప ఇప్పటివరకు ఫౌజీ కి సంబందించిన అప్ డేట్ ఏది అఫీషియల్ గా వదల్లేదు. హను రాఘవపూడి ఇప్పటికే 50 శాతం ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ తో పారలల్ గా ఫౌజీ కూడా పూర్తి చేస్తారని తెలుస్తుంది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా సోషల్ మీడియా ఫేమ్ ఇమాన్వి నటిస్తుండగా. ఇప్పుడు ఈ చిత్రం లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ విలన్ గా కనిపించబోతున్నారనే వార్త బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అభిషేక్ బచ్చన్ ప్రభాస్ కి విలన్ గా ఫౌజీ లో చాలా విభిన్నంగా కనిపిస్తారని అంటున్నారు.
ఈ విషయంపై ఫౌజీ మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో మాత్రం అభిషేక్ బచ్చన్ ప్రభాస్ ఫౌజీ లో నటించడం నిజమంటున్నారు. మరి బాలీవుడ్ నుంచి అభిషేక్ కూడా ఫౌజీ లో భాగమైతే నార్త్ లోను ఈ మూవీపై మంచి అంచనాలే స్టార్ట్ అవుతాయి.