తెలుగులో అనుష్క శెట్టి టైటిల్ రోల్ పోషించిన అరుంధతి చిత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఓ కొత్త ఒరవడి సృష్టించింది. అరుంధతి సస్పెన్స్ థ్రిల్లర్స్ జోనర్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన చిత్రం. అరుంధతి గా అనుష్క విశ్వరూపం చూసిన వారెవరూ అనుష్క ని అభిమానించకుండా ఉండలేరు.
ఆ సినిమాలో అనుష్క అరుంధతి లుక్స్, ఆమె నాట్యం, ఆమె యాక్షన్, అన్ని హైలెట్. ఇప్పుడు ఈ అరుంధతి ని ఇన్నేళ్లకు హిందీలో రీమేక్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ తీసిన దర్శకుడు మోహన్ రాజా ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా టాక్ వినబడుతుంది. అయితే అరుంధతి హిందీ టైటిల్ రోల్ కి అనుష్క పాత్ర లో శ్రీలీల అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట.
అయితే ఆమె అభిమానులు కార్తీక్ ఆర్యన్ మూవీతో హిందీలోకి అడుగుపెడుతున్న శ్రీలీల ఇప్పుడే ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించడం అవసరమా, అసలు అనుష్క ను శ్రీలీల ఏ విధంగా మ్యాచ్ చేస్తుంది. ఆమె క్యూట్ లుక్స్, అలాగే చిన్న పిల్ల ఫేస్ తో శ్రీలీల అసలు అనుష్క లా భయపెట్టగలదా.. శ్రీలీల ఒప్పుకుంటే అది సాహసమే అవుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.