బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్నాళ్లుగా శిఖర్ ధావన్ తో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జరగడమే కాదు.. వారిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళడము, అలాగే తిరుపతి లో శ్రీవారి దర్శనానికి జంటగా వెళ్ళడము, పార్టీల్లో కలిసి కనిపించడం చూస్తున్నాము.త్వరలోనే జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
తాజాగా జాన్వీ కపూర్ ని బాలీవుడ్ మీడియా అదే ప్రశ్న వేసింది.. పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని.. ముందు సినిమాలు ఆతర్వాతే పెళ్లి అంటూ జాన్వీ కపూర్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకుముందు జాన్వీ కపూర్ పదే పదే తిరుపతిలో పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలను కనీ, అరిటాకులో భోజనం చేస్తూ తన భర్తను లుంగీలో చూడాలనే కోరిక ఉన్నట్లుగా చెప్పింది.
శిఖర్ పహారియా తో ప్రేమ, పెళ్లి గురించి కదిపితే.. ప్రస్తుతం తన దృష్టి మొత్తం నటనపైనే ఉంది, ప్రేమలో ఉన్నాను కానీ పెళ్లి కి ఇంకా సమయముంది అని చెప్పుకొచ్చింది. ఈమధ్యనే పరం సుందరితో పరాభవం పొందిన జాన్వీ కపూర్.. ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.