బాలీవుడ్ హీరో-హీరోయిన్స్ చాలామంది పెళ్లిళ్లు చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ కావడమే కాదు పిల్లలను ప్లాన్ చేసుకుంటున్నారు. అలియా భట్-రణబీర్, దీపికా-రణవీర్, కియారా అద్వానీ-సిద్దార్థ్ మల్హోత్రాలు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మరో క్రేజియస్ట్ కపుల్ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే న్యూస్ నడుస్తుంది.
ఆమె గ్లామర్ డాల్ కత్రినా కైఫ్-హీరో విక్కీ కౌశల్ లు. విక్కీ కౌశల్ ని ప్రేమ వివాహం చేసుకున్న కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అనే రూమర్స్ కొద్దిరోజులుగా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కత్రినా కైఫ్-వికీ కౌశల్ లు మరో రెండు నెలలలో పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు, ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
2021లో వివాహ బంధంతో ఒక్కటైన కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ లు అతి త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారని, కత్రినా అక్టోబర్ లేదంటే నవంబర్ లో బిడ్డకు జన్మనివ్వొచ్చనే వార్త బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.