భైరవం తో పవర్ ఫుల్ గా కమ్ బ్యాక్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ మూడు నెలల తిరిగేలోపులే కిష్కిందపురి తో భయపెట్టడానికి వచ్చేసాడు. అనుపమ పరమేశ్వరన్ తో రెండోసారి జత కట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి కి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది.
అయినప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ పెరఫార్మెన్స్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. అంతేకాదు మొదటి రోజు నుంచి నిన్నటి వరకు అంటే ఫస్ట్ వీకెండ్ ముగిసేవరకు కిష్కిందపురి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కిష్కిందపురి థియేటర్స్ లో వర్కౌట్ అయ్యేదే.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో త్వరగానే నిర్మాత ఒడ్డునపడిపోయేవాడు.
కానీ కిష్కిందపురి కి తేజ సజ్జ మిరాయ్ చాలా ఎఫెక్ట్ చేసింది. తేజ సజ్జ మిరాయ్ చిత్రానికి ఓపెనింగ్స్ పరంగానే కాదు ఫస్ట్ వీకెండ్ లోను కళ్ళు చెదిరే కలెక్షన్స్ రావడము, మిరాయ్ కు బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. కిష్కిందపురి ని వదిలేసి బ్లాక్ బస్టర్ మిరాయ్ వైపే మొగ్గు చూపారు ఆడియన్స్.
అందుకే కిష్కిందపురి కలెక్షన్స్ తగ్గడానికి మిరాయ్ అడ్డుపడింది అనేది. లేదంటే కిష్కిందపురి సోలో గా రిలీజ్ అయినట్లయితే నిర్మాత సేఫ్ గా బయటపడేవాడు.