కొంతమంది హీరోయిన్స్ ఉంటారు.. వారికి అదిరిపోయే హిట్ పడినా, లేదంటే స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చినా దురదృష్టం మాత్రం వెంటాడుతుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది నిధి అగర్వాల్. ఆమెకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి క్రేజీ స్టార్ ల అవకాశాలొచ్చాయి. ఇంకేంటి అమ్మడు దశ తిరిగిపోతుంది అనుకున్నారు.
కానీ హరి హర వీరమల్లు, రాజా సాబ్ రెండు చిత్రాలు ఏళ్లతరబడి సెట్ పైనే ఉండిపోయాయి. మరోపక్క బ్లాక్ బస్టర్ సినిమాలో యాక్ట్ చేసినా అమ్మడుకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోవడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అదే మిరాయ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఆ పాటను మేకర్స్ సినిమాలో లేకుండా లేపేశారు.
ఎడిటర్ లేపెయ్యమంటేనే నిధి అగర్వాల్ సాంగ్ లేపేశామని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెబుతున్నాడు. అయితే నిడివి ఎక్కువ అయ్యి నిధి అగర్వాల్ సాంగ్ తీసేసారు. కాని అది ఎవరి బ్యాడ్ లక్ అంటే ఆడియన్స్ ది కాదు నిధి అగర్వాల్ ది. అసలే హరి హర వీరమల్లు చిత్రం ఎఫెక్ట్ తో డిజప్పాయింట్ మోడ్ లో ఉన్న నిధి కి మిరాయ్ స్పెషల్ సాంగ్ లేచిపోవడం మరింత కష్టంగా మారింది.
మరి రాజా సాబ్ ని నమ్ముకున్న నిధి అగర్వాల్ కి ఆ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.