పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఫిలిం OG విడుదలకు కేవలం ఇంకో 10 రోజులే అంటే సెప్టెంబర్ 25 న సినిమా రిలీజ్ అవుతుంది. సుజిత్ దర్శకత్వంలో దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన OG పై భారీ అంచనాలే ఉన్నాయి. OG విడుదలకు నెల రోజుల ముందే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, ఓవర్సీస్ బుకింగ్స్ లో OG వేరే లెవల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
మరోపక్క అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ మొదలు కాకపోవడంపై పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన పెరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి రెండుమూడు పెద్ద ఈవెంట్స్ లో పాల్గొంటేనే OG పై క్రేజ్ వస్తుంది. అసలే వీరమల్లు ఎఫెక్ట్ కనిపించకుండా జాగ్రత్త పడాల్సిన సమయంలో మేకర్స్ OG ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యకపోవడం పై ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
10 డేస్ టు గో OG అంటూ ఫ్యాన్స్ నిర్మాణసంస్థ ని ట్యాగ్ చేస్తూ మేలుకొలుపుతున్నారు. పవన్ ని తీసుకురండి, హరి హర వీరమల్లు మేకర్స్ లా మీరు కూడా పవన్ క్రేజ్ ను వాడండి అంటూ సలహాలిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ని పక్కనపెట్టి మిగతా నటులైనా మీడియా ముందుకు వస్తే OG మీడియాలో కనిపిస్తుంది. లేదంటే OG ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుంది.. అది మరింత అవమానం అంటూ పవన్ ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు.