ఏపీ డిప్యూటీ సీఎం గా నిత్యం బిజీగా వుండే జాబ్ లో పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల కమిట్మెంట్స్ ని కూడా పూర్తి చేస్తున్నారు కాదు కాదు చేసేసారు. హరి హర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ ని బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేసేసారు. వీరమల్లు వచ్చింది, సైలెంట్ గా మాయమైపోయింది. ఇప్పుడు అంటే ఈ నెల 25 కి OG రాబోతుంది.
OG ప్రమోషన్స్ పక్కన పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని ఫినిష్ చేసేసారు. హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ కోసం ఎంతగా వెయిట్ చేసాడో ఆయన డేట్స్ ఇవ్వగానే అంతే చకచకా షూటింగ్ చక్కబెట్టేసి అప్ డేట్ ఇచ్చేసారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ రావడమే తరువాయి.
ప్రస్తుతం తన కమిట్మెంట్స్ ని పూర్తి చేసేసి పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యారు. గత ఐదేళ్లుగా సెట్ పై ఉన్న సినిమాలను ఐదు నెలల్లో పూర్తి చేసేసి పవన్ కళ్యాణ్ తన డ్యూటీ ఎక్కేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తో సినిమాలు ఆపేస్తారా.. లేదంటే మళ్ళీ సినిమాలు కమిట్ అవుతారా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.