అమరన్ చిత్రం తో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న శివకార్తికేయన్ రీసెంట్ గా మదరాసి తో డిజప్పాయింట్ చేసారు. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన మదరాసి గత శుక్రవారం విడుదల కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఆయన నుంచి రాబోయే పరాశక్తి పైనే శివకార్తికేయన్ హోప్స్ ఉన్నాయి.
అయితే ఇప్పుడా పరాశక్తి చిత్రాన్ని ఏకంగా 2026 సంక్రాంతి బరిలో నిలిపారు. మరి సంక్రాంతి సీజన్ అంటే ఎలా ఉంటుంది, ఎంత పెద్ద పెద్ద స్టార్స్ సంక్రాంతి సీజన్ ని చూజ్ చేసుకుంటారు, అసలే పాన్ ఇండియా మూవీస్ అంటూ పలు భాషల హీరోలు ఆ భాషా, ఈ భాష అని లేకుండా బాక్సాఫీసు మీద దండెత్తుతున్నారు.
తెలుగులో అయితే మెగాస్టార్ చిరు మన శంకర వర ప్రసాద్ గారు, ప్రభాస్ రాజా సాబ్ లాంటి భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇంకా ఎన్ని ఆ లైన్ లోకి వస్తాయో తెలియదు. తమిళనాట విజయ్ లాస్ట్ మూవీ జన నాయాగన్ సంక్రాతి రిలీజ్ అంటున్నారు. ఇలాంటి సమయంలో శివకార్తికేయన్ పరాశక్తి ని సంక్రాంతి సీజన్ అందులోను జనవరి 14 అంటూ డేట్ ఇవ్వడం చూసి అంత రిస్క్ అవసరమా రాజా అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.