ఇప్పటివరకు సాయి పల్లవి చేసిన సినిమాలన్ని వేటికవే సాటి. ఆమె గబగబా సినిమాలు ఒప్పేసుకుని హడావిడిగా షూటింగ్స్ చేసెయ్యదు, ఆచితూచి ఓకె చేస్తుంది. హిందీలోకి అఫీషియల్ గా రామాయణతో అడుగుపెట్టబోతోంది. కానీ ఆమె నటించిన మరో హిందీ సినిమా ఇప్పుడు రామాయణ కన్నా ముందే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
జునైద్ ఖాన్ హీరోగా సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ డిసెంబర్ 12 రిలీజ్ కి రెడీ అయ్యింది. ఎప్పుడు మంచి మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సాయి పల్లవి అసలు ఈ లవ్ స్టోరీ ని ఎందుకు ఒప్పుకుందో అనేది ఆమె ఫ్యాన్స్ ఇప్పటికి టెన్షన్ పెడుతున్న విషయం. ఈ చిత్రం రిజల్ట్ తేడా వస్తే సాయి పల్లవి కి నార్త్ ఆడియన్స్ ని ఎంతో కొంత వ్యతిరేఖత వస్తుంది అనేది ఆమె ఫ్యాన్స్ భయం.
మరి సాయి పల్లవి కథ నచ్చి ఒప్పుకుంది అంటే అది ఆలోచించాల్సిన విషయమే. ఏక్ దిన్ హిట్ అయితే సాయి పల్లవి జడ్జిమెంట్ పర్ఫెక్ట్, అదే తేడా కొడితే అనేది ఇప్పడు ఆ సినిమా రిజల్ట్ పై ఆధారపడివుంది. అన్నట్టు సాయి పల్లవి కి తమినాట శింబు చిత్రంలో ఓ ఛాన్స్ వచ్చిందట.
వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందబోయే గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ కథలో హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యం ఉంటుందట. ఈ చిత్రం కోసమే సాయి పల్లవిని సంప్రదించారని, ఆమె నిర్ణయం కోసం టీమ్ ఎదురు చూస్తుంది అని తెలుస్తుంది.