ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి అలాగే ప్రేక్షకుల నుంచి వినబడుతున్న మాట. తక్కువ బడ్జెట్-బెస్ట్ క్వాలిటీ . పెద్ద పెద్ద దర్శకులు భారీ బడ్జెట్ తో సినిమాలు చెయ్యడము, స్టార్ హీరోలను పెట్టుకోవడమే కానీ VFX విషయంలో చీప్ క్వాలిటీ ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకుంటున్నారు.
తేజ సజ్జ మిరాయ్ చిత్రం చూసాక VFX క్వాలిటీ పై ప్రేక్షకులు, సినీ విమర్శకులు చేస్తోన్న కామెంట్స్, తక్కువ బడ్జెట్ తో ఇంత బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం మాములు విషయం కాదు, కార్తీక్ ఘట్టమనేని తన టీమ్ తో మ్యాజిక్ చేసాడు.. అదే రాజమౌళి లాంటి డైరెక్టర్స్ అయితే ఆ VFX వర్క్ కోసం కోట్లు పోసేవారు అంటూ మాట్లాడుకుంటున్నారు.
రీసెంట్ గా హరి హర వీరమల్లు, వార్ 2 గ్రాఫిక్స్ విషయంలో ఎంత ట్రోలింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి చీప్ క్వాలిటీ VFX ముచ్చట సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. మెగాస్టార్ చిరు విశ్వంభర అయితే ఆ CG వర్క్ విషయంగానే ఏడాదిన్నర పోస్ట్ పోన్ అయ్యి ఏకంగా సమ్మర్ కి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో తేజ సజ్జ మిరాయ్ VFX బెస్ట్ క్వాలిటీతో కనిపించడంపై సోషల్ మీడియాలో తెగ ట్వీట్లు వేస్తున్నారు.
పెద్ద హీరోలు కూడా ఈ VFX విషయాన్ని పట్టించుకోకుండా ఫైల్యుర్స్ చూస్తుంటే.. చిన్న హీరో కాదు కాదు పాన్ ఇండియా హీరో తేజ సజ్జ సినిమాకి తక్కువ బడ్జెట్ తో ఇంత క్వాలిటీ VFX ని అందించడం పై అన్ని వైపులా నుంచి ప్రత్యేకంగా అప్రిశేషన్స్ అందుతున్నాయి మిరాయ్ టీమ్ కి.