నేపాల్ లో చెలరేగిన అల్లర్ల కారణంగా జరుగుతున్న హింసాకాండలో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు ఏపీ ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హుటాహుటిన చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. నిన్న బుధవారం నారా లోకేష్ అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారితో ఎప్పటికప్పుడు ఫోన్ మట్లాడుతూ వారికి ధైర్యం చెబుతూ అండగా నిలిచారు.
ఈ రోజు ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు మంత్రి నారా లోకేష్ చేరుకొని నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు జరిగేలా దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సిమి కోట్ లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్ కు తరలింపు.
యూపి బోర్డర్ నుండి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో 12 మంది తెలుగువారు లక్నో చేరుకోనున్నారు. అక్కడ లక్నో నుండి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఖాట్మండూ సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్.
నేపాల్ లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్ళకి చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అలెర్ట్ గా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.