ఒకప్పుడు టాలీవుడ్ లో సందడి చేసిన మెహ్రీన్ కౌర్ ఇప్పుడు టాలీవుడ్ లో కనిపించడం అటుంచి ఆమె అసలు సినిమాల్లోనే కనిపించడం లేదు. ఈమధ్యన కోలీవుడ్ ఇంద్ర మూవీ ప్రమోషన్స్ లో కనబడిన మెహ్రీన్ కి తెలుగు దర్శకనిర్మాతలు మొహం చాటేస్తున్నారు. మరీ స్టార్ హీరోల అవకాశాలు, రాకపోయినా.. అప్పట్లో మెహ్రీన్ ఏదో ఒక అవకాశంతో బిజీగానే ఉండేది.
ఇక బాయ్ ఫ్రెండ్ ని ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకున్న మెహ్రీన్ సినిమాలకు బిగ్ బ్రేకే ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ అందమైన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా మెహ్రీన్ వదిలిన పిక్స్ చూసి ఈ అందాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెహ్రీన్ కౌర్ బ్లాక్ మోడ్రెన్ డ్రెస్ లో అలా నడిచొస్తుంటే.. వయ్యారి హంస నడకదానా అంటూ సాంగ్ ఏసుకుంటున్నారు. అంతేకాదు ఈ అందానికి ఇండస్ట్రీ ఇంత గ్యాప్ ఎందుకిచ్చిందో అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.