నేడు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలిలో ఆనందం తాండవం చేస్తుంది. వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి లు తల్లి తండ్రులు అవడంతో స్నేహితులు, సన్నిహితులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నాగబాబు తాతయ్యారు, వరుణ్ తేజ్ తండ్రయిన విషయం తెలుసుకున్న మెగాస్టార్ హుటాహుటిన లావణ్య డెలివరీ అయిన రెయిన్ బో ఆసుపత్రికి వచ్చేసారు.
చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ సాంగ్ షూట్ లో ఉన్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండడంతో మెగాస్టార్.. మెగా ఫ్యామిలీలోకి మరో బుడతడు వచ్చాడు అనగానే హుటాహుటిన వరుణ్ బిడ్డ దగ్గర వాలి పోయారు. అంతేకాదు వరుణ్ తేజ్ కొడుకుని చేతుల్లోకి ఎత్తుకుని మెగాస్టార్ మురిసిపోయిన పిక్ వైరల్ అవుతుంది.
మెగా ఫ్యామిలీ కి వారసుడు వచ్చాడు అన్న ఆనందంలో మెగాస్టార్ కనిపించారు. వరుణ్ తేజ్-లావణ్య లకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ తనకు వారసుడిని అందించిన భార్య లావణ్య ముద్దాడుతూ థాంక్స్ చెప్పిన పిక్ షేర్ చేసారు.