Advertisementt


మెగా వారసుడొచ్చేసాడు

Wed 10th Sep 2025 02:36 PM
varun  మెగా వారసుడొచ్చేసాడు
Its A Baby Boy For Varun And Lavanya మెగా వారసుడొచ్చేసాడు
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ చిరు కుమార్తెలు సుశ్మిత, శ్రీజ లకు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు. రామ్ చరణ్ కి అయినా వారసుడు పుడతాడని మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు కూడా అమ్మాయే పుట్టింది. మెగాస్టార్ చిరు మహాలక్ష్మి ఇంటికొచ్చింది అంటూ క్లింకార ను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. ఇప్పుడు మెగా ఫ్యామిలోకి వారసుడొచ్చాడు. నాగబాబు కొడుకు, హీరో వరుణ్ తేజ కి అబ్బాయి పుట్టాడు. 

వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి ఈరోజు హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మెగా వారసుడు రాక ఫ్యామిలీ మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. మెగాస్టార్ చిరు మన శంకర వర ప్రసాద్ సెట్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకొని వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలియపారు.  

నాగబాబు, ఆయన భార్య పద్మజ, లావణ్య పేరెంట్స్ అంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. వరుణ్ తేజ్-లావణ్య తల్లి-తండ్రులు అవడంతో ఆ జంటకు సినీ ప్రముఖులు, స్నేహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Its A Baby Boy For Varun And Lavanya:

Varun Tej and Lavanya Tripathi Welcome Baby Boy

Tags:   VARUN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ