పిఠాపురం వర్మ ప్రస్తుతం అసంతృప్తి తో రగిలిపోతున్నారు. మెగా బ్రదర్స్ కోసం అన్ని త్యాగం చేసిన SVSN వర్మ గారిని చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకపోవడంతో ఆయన మనసులోనే బాధపడుతూ పైకి పవన్ కళ్యాణ్ తో కలిసి మెలిసి తిరుగుతున్నారు. వర్మ కు ఎమ్యెల్సీ ఇస్తారనుకున్న సమయంలో నాగబాబు వచ్చి చేరారు.
అయితే తాజాగా పిఠాపురం SVSN వర్మ వైసీపీ లో చేరుతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణమేమి లేదు. ఆయన రీసెంట్ గా అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేత ముద్రగడను తన అనుచరులతో వెళ్లి పలకరించి, కాసేపు మాట్లాడి వచ్చినప్పటినుంచి వర్మ వైసీపీ లో చేరుతున్నారనే వార్తలను వైసీపీ వాళ్ళు ప్రచారం చేసేస్తున్నారు.
SVSN వర్మ-ముద్రగడ ఏ విషయంపై చర్చించారు అనే విషయంలో అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. ముద్రగడ ద్వారా ఆయన వైసీపీ లోకి వెళ్లేందుకు ముద్రగడ తో చర్చించి వచ్చారంటూ వర్మ పై సోషల్ మీడియాలో విచిత్రమైన వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకవేళ వర్మ వైసీపీ లోకి చేరాలంటే ముద్రగడ సహాయం SVSN వర్మగారు తీసుకోవడమా.. ఇదేం విచిత్రం అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.