పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సెట్ నుంచి ఫౌజీ షూటింగ్ కి జంప్ అయ్యారు. రాజా సాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ డన్ కానీ.. పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలను వెంటనే పూర్తి చేసి స్పిరిట్ సెట్ కి వెళ్లాల్సి ఉంది. అది ఈనెలాఖరుకు జరిగే అవకాశం ఉంది అంటున్నా.. అది జరిగేలా కనిపించడం లేదు.
ప్రభాస్ ఆచితూచి షూటింగ్ చేస్తారు కానీ.. హరీబరిగా పరుగులు పెట్టరనే విషయం అందరికి తెలుసు. అయితే ప్రభాస్ బర్త్ డే వచ్చే నెలలో ఉంది. ఇప్పటినుంచి ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ సర్ ప్రైజ్ ఏమిటి, ఫౌజీ ట్రీట్ ఏమిటి అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ ఖాయమనే మాట వినిపిస్తుంది.
ఈలోపే అంటే అక్టోబర్ 2 న విడుదల కాబోయే పాన్ ఇండియా ఫిలిం కాంతార చాప్టర్ 1 థియేటర్స్ లో ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఎప్పుడో జనవరి 9 న విడుదల కాబోయే రాజా సాబ్ కి మూడు నెలల ముందే ట్రైలర్ వదులుతారా.. అహ.. అనుకున్నా అది వర్కౌట్ అవుతుందా అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.